Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కేటీఆర్‌కు సెప్టెంబర్ 30 మర్చిపోలేని రోజు: చామల

Author
Posted By Telangana Gontuka
| 29 Sep 2026, 03:01 PM | TELANGANA
కేటీఆర్‌కు సెప్టెంబర్ 30 మర్చిపోలేని రోజు: చామల

హైదరాబాద్: సిరిసిల్లలో ఈ నెల 30న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లలో రూ.375 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నేతన్న బజార్, కోనరావుపేట మోడల్ స్కూల్, వేములవాడలో రూ.90 కోట్ల అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకు రూ.300 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. సిరిసిల్లలో కలెక్టరేట్ నిర్మాణం, జేఎన్‌టీయూలో సౌకర్యాలపై కూడా విమర్శలు చేశారు. కేటీఆర్ 2009 నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కొంగరకలాన్ వక్ఫ్ భూముల అంశంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో కేటీఆర్‌కు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.