Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్రం నిషేధం

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ: మనుషులు, జంతువుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కలుపు సంహారకం పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్లపై నిషేధంతో పాటు గతంలో జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేసింది. నిపుణుల కమిటీ, రిజిస్ట్రేషన్‌ కమిటీ సిఫార్సుల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.