Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు సీజే!

సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు సీజే!

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆయనతో పాటు ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ సునీత అగర్వాల్‌ పేర్లను కూడా సిఫారసు చేసింది. ఈ నియామకాలు ఆమోదమైతే సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరనుంది. అలాగే మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ టీ. వినోద్‌కుమార్‌ను తిరిగి తెలంగాణ హైకోర్టుకు రప్పించేందుకు కొలీజియం సిఫారసు చేసింది.