Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌..!

Author
Posted By satla anil kumar
| 28 Sep 2026, 06:10 PM | Array
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌..!

వర్ధన్నపేట: గంజాయి విక్రయానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి నుంచి కిలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన ముత్యాల శ్యామ్‌, వర్ధన్నపేట పట్టణానికి చెందిన పిన్నింటి భరత్‌ గత కొంతకాలంగా గంజాయి సేవిస్తున్నట్లు తెలిపారు. శ్యామ్‌ ఇటీవల తన పాత స్నేహితుడి ద్వారా అరకు ప్రాంతం నుంచి ఎండు గంజాయిని తీసుకొచ్చి కట్ర్యాలలోని తన ఇంట్లో నిల్వ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని వర్ధన్నపేటలో విక్రయించేందుకు ఇద్దరూ కలిసి కట్ర్యాల నుంచి ఆటోలో బయలుదేరి ఇల్లంద గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్‌ వద్దకు చేరుకోగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు కిలో గంజాయి, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ ఎం.రాజుతో పాటు కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌, సాగర్‌ పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌..! - Additional Image