Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చేతబడి నెపంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 02:48 PM | TELANGANA
చేతబడి నెపంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి

రంగారెడ్డి: చేతబడి చేసిందన్న అనుమానంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుష ఘటన మంచాల మండలం నోముల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లటి వెంకటమ్మ (60)పై కొందరు గ్రామస్తులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనను చెట్టుకు కట్టేసి కొట్టి తీవ్రంగా వేధించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.