Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

*సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆత్మహత్య*

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 11:09 AM | NATIONAL
*సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆత్మహత్య*

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన సమయంలో ఆమె ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు సమాచారం. సంభాషణలో ఓ అంశంపై కలత చెందిన నిధి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ యువకుడు నిధి తల్లికి సమాచారం అందించగా.. ఆమె అక్కడికి చేరుకునేలోపే మృతి చెందారు. నిధికి ఫేస్‌బుక్‌లో 9 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.