Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ప్రతి అర్హుడూ భాగస్వామి కావాలి

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 08:03 PM | TELANGANA
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ప్రతి అర్హుడూ భాగస్వామి కావాలి

జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, విద్యావంతులు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్‌–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2027 మార్చిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సెప్టెంబర్‌ 28 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఇప్పటికే జాబితాలో పేరున్నవారు కూడా కొత్తగా ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసి, విద్యార్హత ధ్రువపత్రాల ప్రతులను జత చేయాలని కోరారు. గడువులోగా నమోదు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.