Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆరుగురి పేర్లతో పీసీసీ జాబితా.. 29న ఢిల్లీలో తుది నిర్ణయం

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:45 PM | Politics, Technology, TELANGANA, TELUGU NRI
ఆరుగురి పేర్లతో పీసీసీ జాబితా.. 29న ఢిల్లీలో తుది నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. నల్గొండ–వరంగల్‌–ఖమ్మం, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానాలకు ముగ్గురేసి చొప్పున ఆరుగురి పేర్లతో పీసీసీ జాబితా సిద్ధం చేసి పార్టీ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. నల్గొండ–వరంగల్‌–ఖమ్మం స్థానానికి సర్వోత్తమ్‌ రెడ్డి, పీవీ శ్రీనివాస్‌, చనగాని దయాకర్‌ పేర్లు, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానానికి మన్నె జీవన్‌ రెడ్డి, సామా రామ్మోహన్‌ రెడ్డి, గౌరీ సతీశ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నల్గొండ–వరంగల్‌–ఖమ్మం అభ్యర్థి ఎంపిక బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానానికి మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు అప్పగించినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాపై సెప్టెంబర్‌ 29న ఢిల్లీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.