Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతుతో మాటాముచ్చట.. పొలంలో మల్లన్న సందడి!

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:30 PM | TELANGANA
రైతుతో మాటాముచ్చట.. పొలంలో మల్లన్న సందడి!

కొడంగల్‌: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొడంగల్‌ ప్రాంతంలో ఓ రైతు పొలాన్ని సందర్శించారు. రైతుతో ముచ్చటిస్తూ వ్యవసాయం ఎలా సాగుతోంది? ఏయే పంటలు పండిస్తున్నారు? పంట పెట్టుబడి ఎంత అవుతోంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది? సాగుకు సరిపడా నీరు అందుబాటులో ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల అవసరాలపై చర్చించారు. అనంతరం పొలంలో స్వయంగా ట్రాక్టర్‌ నడపడంతో పాటు ఎడ్లతో దున్నుతూ వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు.