Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చేగూరులో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ.2.30 లక్షలకు లడ్డూ వేలం

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:24 PM | TELANGANA
చేగూరులో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ.2.30 లక్షలకు లడ్డూ వేలం

చేగూర్‌: గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. కొత్తూరు మండలం చేగూర్‌లో హనుమాన్‌ సాయి యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ముగియడం సంతోషంగా ఉందన్నారు. లడ్డూ వేలంలో మంచనపల్లి నందు గౌడ్‌ రూ.2.30 లక్షలకు, చిన్న లడ్డూను మంచనపల్లి శివంష్‌ గౌడ్‌ రూ.లక్షకు దక్కించుకున్నారు. మాజీ ఎంపీపీ దంపతులు మంచనపల్లి శివశంకర్‌ గౌడ్‌, ప్రియాంక గౌడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.