Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాహుల్‌ను ప్రధానిని చేయాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:22 PM | TELANGANA
రాహుల్‌ను ప్రధానిని చేయాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేరేడుచర్ల: తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నేరేడుచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలు, ఎన్నికల ప్రక్రియపై రాహుల్‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానాలు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఐక్యతతో క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.