Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇన్‌సర్వీస్‌ టెట్‌లో 6,728 మంది ఫెయిల్

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:03 PM | TELANGANA
ఇన్‌సర్వీస్‌ టెట్‌లో 6,728 మంది ఫెయిల్

హైదరాబాద్: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ నిర్వహించిన ప్రత్యేక టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 24,986 మంది దరఖాస్తు చేసుకోగా 22,477 మంది హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించగా, 6,728 మంది టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. పేపర్‌-1లో 1,544 మంది, పేపర్‌-2 గణితం, సైన్స్‌లో 2,411 మంది, సోషల్‌ స్టడీస్‌లో 2,773 మంది ఫెయిలయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 70.07 శాతంగా నమోదైంది.