Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పర్వతగిరిలో 16 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 10:25 PM | TELANGANA
పర్వతగిరిలో 16 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పర్వతగిరి : పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా డంపింగ్‌ చేస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, పర్వతగిరి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పర్వతగిరి పరిధిలోని మైనేని రాము లక్ష్మీ పౌల్ట్రీ ఫామ్‌లో తనిఖీలు చేపట్టి 16 క్వింటాళ్ల (1,600 కిలోలు) పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.56 వేలుగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మైనేని రాము (43)ను గుర్తించారు. బియ్యాన్ని తదుపరి చర్యల కోసం పర్వతగిరి పోలీసులకు అప్పగించారు. దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్‌ జి. సుబ్బారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.