Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హోటళ్లలో ఎక్స్‌పైర్డ్‌ మాంసం.. మళ్లీ వాడుతున్న వంట నూనె!

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 10:03 PM | HEALTH, NATIONAL, TELANGANA
హోటళ్లలో ఎక్స్‌పైర్డ్‌ మాంసం.. మళ్లీ వాడుతున్న వంట నూనె!

తెలంగాణవ్యాప్తంగా ఫుడ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్లలో TGSAFE అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మాదాపూర్‌లోని మానెస్టరీ ఆంఫీ బ్రూవరీ, వరంగల్‌లోని అల్ఫారామ్‌ హోటల్, కామారెడ్డిలోని మాల్గుడి రెస్టారెంట్‌లో గడువు ముగిసిన పచ్చి మాంసం, ఫ్రీజర్లలో నిల్వ చేసిన వండిన ఆహారం, లేబుల్స్‌ లేని పదార్థాలు గుర్తించారు. సుమారు 5 కిలోల రీయూజ్డ్‌ వంట నూనె, సింథటిక్‌ ఫుడ్‌ కలర్, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పగిలిన గుడ్లు కూడా బయటపడ్డాయి. వరంగల్‌ అల్ఫారామ్‌ హోటల్‌కు ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసు జారీ చేశారు.