Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విమాన సర్వీసులు పెంచుతాం.. నూతన టెర్మినల్‌ పనులు త్వరలో పూర్తి: రామ్మోహన్‌ నాయుడు

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 10:00 PM | ANDHRA PRADESH, Politics
విమాన సర్వీసులు పెంచుతాం.. నూతన టెర్మినల్‌ పనులు త్వరలో పూర్తి: రామ్మోహన్‌ నాయుడు

కడప: కడప ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. కడపకు రావడం ఆనందంగా ఉందని, ఆత్మీయ స్వాగతం పలికిన మీడియా, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీతో పాటు పరిశ్రమలు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. కడప విమానాశ్రయ నూతన టెర్మినల్‌ పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు విమాన సర్వీసులను మరింత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని రామ్మోహన్‌ నాయుడు అన్నారు.