Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆస్తి కోసం మంచానికే పరిమితమైన తల్లిపై దాడి!

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 09:58 PM | TELANGANA
ఆస్తి కోసం మంచానికే పరిమితమైన తల్లిపై దాడి!

హైదరాబాద్‌: ఆస్తి వివాదం నేపథ్యంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపై కూడా దాడి చేసినట్లు కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి టి. నాగార్జున ఆరోపించారు. నాలుగేళ్లుగా తన అన్న, వదిన, ఆమె సోదరుడి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తనతో పాటు తల్లిపై పలుమార్లు భౌతిక దాడులు జరిగాయని, కొన్ని ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని పేర్కొన్నారు. దాడుల్లో తల్లికి, తనకు గాయాలయ్యాయని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని నాగార్జున ఆరోపించారు.