Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దుర్వినియోగమైతే భారీ ప్రాణనష్టం.. బిల్‌ గేట్స్‌ సంచలన హెచ్చరిక

దుర్వినియోగమైతే భారీ ప్రాణనష్టం.. బిల్‌ గేట్స్‌ సంచలన హెచ్చరిక

వాషింగ్టన్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దుర్వినియోగంపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల చేతుల్లో అధునాతన ఏఐ సాధనాలు పడితే భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏఐను దుర్వినియోగం చేస్తే సంభవించే ఘటనలు 100 కోట్ల మంది మరణానికి దారితీసే స్థాయిలో ఉండే సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఏఐ వల్ల తప్పనిసరిగా అంతమంది చనిపోతారని తాను అంచనా వేయడం లేదని స్పష్టం చేశారు. సైబర్‌ దాడులు, ప్రమాదకర జీవాయుధాల తయారీ వంటి వాటికి ఏఐ దుర్వినియోగమయ్యే అవకాశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, సంస్థలు ఏఐ భద్రత, నియంత్రణపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు.