Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పెళ్లికి 21 ఏళ్లు ఆగమంటే.. తండ్రినే కాల్చేశాడు!

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 09:20 PM | Crime, NATIONAL
పెళ్లికి 21 ఏళ్లు ఆగమంటే.. తండ్రినే కాల్చేశాడు!

చండీగఢ్: ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాలని చెప్పినందుకు ఓ యువకుడు కన్న తండ్రినే తుపాకీతో కాల్చి చంపాడు. చండీగఢ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నితిన్‌సింగ్‌ (తండ్రి)కు 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా తల్లిదండ్రులు చట్టప్రకారం 21 ఏళ్లు నిండాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన యువకుడు తండ్రిపై కాల్పులు జరిపాడు. తల్లిపైనా దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి హత్యను ఇతరులు చేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలోనూ కేసు ఉండటం గమనార్హం.