Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వరద ఉధృతిలో ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ!

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 08:49 PM | ANDHRA PRADESH, Crime, NATIONAL, హైదరాబాద్
వరద ఉధృతిలో ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ!

శ్రీకాకుళం : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వంశధార వరద ఉధృతితో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికార యంత్రాంగం ప్రమాదంలో చిక్కుకుంది. బూర్జ మండలం అల్లిన గ్రామం వద్ద ముంపు పరిస్థితులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డితో పాటు అధికారులు పడవలో వెళ్లారు. నదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే వరద ఉధృతి పెరగడంతో పడవ నియంత్రణ కోల్పోయి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే రంగంలోకి దిగి స్పీడ్‌ బోట్లతో సహాయక చర్యలు చేపట్టాయి. ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీతో పాటు సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం కూడా అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.