Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హైదరాబాద్‌ రెస్టారెంట్లలో బొద్దింకలు.. ఎలుకలు!

హైదరాబాద్‌ రెస్టారెంట్లలో బొద్దింకలు.. ఎలుకలు!

హైదరాబాద్‌: నగరంలోని 15 రెస్టారెంట్లలో సెప్టెంబర్‌ 24న TG SAFE బృందాలు తనిఖీలు చేపట్టాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, వాటి విసర్జితాలతోపాటు తీవ్ర అపరిశుభ్రతను గుర్తించాయి. గడువు ముగిసిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్ర పాత్రలు, డ్రైనేజీ, స్టోరేజ్‌లో లోపాలను గుర్తించారు. 16 నమూనాలు సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్‌ చేశారు. బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్‌ను లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్నందుకు మూసివేశారు.