Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గురుకులంలో ఎలుకల కలకలం.. 14 మంది విద్యార్థినులకు కాటు!

గురుకులంలో ఎలుకల కలకలం.. 14 మంది విద్యార్థినులకు కాటు!

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఎలుకలు 14 మంది విద్యార్థినులను కరిచాయి. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గురుకులంలో ఎలుకల బెడదపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.