Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇరాన్‌ 7 రోజుల శాంతి ప్రతిపాదన.. ట్రంప్‌ తిరస్కరించినట్లు నివేదిక!

ఇరాన్‌ 7 రోజుల శాంతి ప్రతిపాదన.. ట్రంప్‌ తిరస్కరించినట్లు నివేదిక!

న్యూయార్క్‌: హోర్ముజ్‌ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరిచేందుకు ఇరాన్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా నౌకా దిగ్బంధనం ఎత్తివేయడం, చమురు ఆంక్షలను సడలించడం, కాల్పుల విరమణ అమలు చేస్తే హోర్ముజ్‌ను తెరుస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చీ తెలిపారు. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను అమెరికాకు అందించినట్లు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్‌ తిరస్కరించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్ నివేదించింది. నవంబర్‌ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు పునఃప్రారంభించే అవకాశంపై కూడా ట్రంప్‌ వ్యాఖ్యలు చేసినట్లు నివేదిక పేర్కొంది.