Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రెండు వైన్స్‌లో చోరీ

Author
Posted By satla anil kumar
| 25 Sep 2026, 11:31 PM | TELANGANA
రెండు వైన్స్‌లో చోరీ

వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలోని మల్లికార్జున, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి దుకాణాలు మూసివేసి, శుక్రవారం ఉదయం తెరిచే సమయానికి చోరీ జరిగినట్లు నిర్వాహకులు గుర్తించారు. మల్లికార్జున వైన్స్‌లో వెనుక తలుపు తాళం పగులగొట్టి రూ.2.40 లక్షలు, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో వెంటిలేటర్‌ పగులగొట్టి రూ.65 వేల నగదును అపహరించారు. మొత్తం రూ.3.05 లక్షల నగదు చోరీకి గురైంది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.