Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద సీపీ సజ్జనర్‌ బందోబస్తు పరిశీలన

Author
Posted By Telangana Gontuka
| 25 Sep 2026, 08:37 AM | TELANGANA
ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద సీపీ సజ్జనర్‌ బందోబస్తు పరిశీలన

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జన ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బందోబస్తు కోసం సుమారు 20 వేల మంది పోలీసు సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. శోభాయాత్ర మార్గంలోని 10 వేల సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, యువతుల భద్రత కోసం మూడు షిఫ్టుల్లో 26 షీ-టీమ్స్‌ విధులు నిర్వహిస్తాయని చెప్పారు. ప్రజలు ట్రాఫిక్‌ మార్గదర్శకాలను పాటించి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ సూచించారు.