Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆకేరు వాగుకు జలకళ..!

ఆకేరు వాగుకు జలకళ..!

వర్ధన్నపేట: మండలం మీదుగా ప్రవహించే ఆకేరు వాగులో వరద నీరు చేరడంతో శుక్రవారం ప్రవాహం పెరిగింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఆకేరు వాగుకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాగు జలకళను సంతరించుకుంది.
జూలై మాసంలో కురిసిన వర్షాలతో ఆకేరు వాగు నిండాల్సి ఉండగా, దాదాపు రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వాగులో నీటి ప్రవాహం తగ్గిపోయి వెలవెలబోయిన పరిస్థితి నెలకొంది. తాజాగా వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది.
వర్ధన్నపేట మండల పరిధిలోని ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఆకేరు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉండటంతో వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాలు మరింతగా కురిస్తే ఆకేరు వాగు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.