Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో రైతు మృతి

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 08:26 PM | TELANGANA
ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో రైతు మృతి

వరంగల్: గీసుగొండ మండలం వంచనగిరికి చెందిన రైతు ఎడ్డె రవికుమార్ (42) ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 20న పారాక్వాట్ గడ్డిమందు సేవించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం హనుమకొండలోని ఏకశిల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగానే మృతి చెందినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.