Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వర్ధన్నపేట PACS చైర్మన్‌గా అబ్బిడి రాజిరెడ్డి బాధ్యతల స్వీకారం

Author
Posted By Hanumkonda
| 24 Sep 2026, 12:45 PM | Array
వర్ధన్నపేట PACS చైర్మన్‌గా అబ్బిడి రాజిరెడ్డి బాధ్యతల స్వీకారం

వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) నూతన చైర్మన్‌గా అబ్బిడి రాజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారానికి ముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం PACS డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా కార్యాలయానికి చేరుకుని చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రైతులకు PACS ద్వారా మెరుగైన సేవలు అందించడంతో పాటు సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని రాజిరెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానన్నారు. కార్యక్రమంలో PACS డైరెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.