Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నేడు సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌ కేసు విచారణ

నేడు సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌ కేసు విచారణ

న్యూఢిల్లీ: అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. కాగా, దానం నాగేందర్‌ పిటిషన్‌పై ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. దీంతో ఇరుపక్షాల వాదనలు వినే అవకాశం ఉంది. కేసు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.