Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌.. నెమ్మదించిన వాహనాల రాకపోకలు

ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌.. నెమ్మదించిన వాహనాల రాకపోకలు

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. చిచ్చా టీ, అయోధ్య, నిరంకారి ప్రాంతాల నుంచి ఓల్డ్‌ పీఎస్‌ సైఫాబాద్‌, టెలిఫోన్‌ భవన్‌ రోడ్‌, షాదన్‌ కాలేజీ వైపు ట్రాఫిక్‌ మందకొడిగా కొనసాగుతోంది. వాహనదారులు ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్‌ సిబ్బంది సూచనలు పాటిస్తూ వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరారు.