Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/u227957947/websites/rLhsdmnqM/public_html/single.php on line 64
భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పూజలు.. బురాన్‌పల్లిలో మహా అన్నదానం
Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పూజలు.. బురాన్‌పల్లిలో మహా అన్నదానం

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 05:44 PM |

బురాన్‌పల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బుధవారం గణనాథుడి నిమజ్జనాన్ని అట్టహాసంగా చేపట్టారు. డప్పు వాయిద్యాల నడుమ మహిళలు కోలాటాలతో గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
బురాన్‌పల్లిలో మహా అన్నదానం....
మండలంలోని బురాన్‌పల్లి గ్రామంలో మార్గదర్శి యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపం వద్ద బుధవారం మహా అన్నదానం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పరిపాటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం గొప్ప సేవా కార్యక్రమమని వారు పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం గ్రామ ఐక్యతకు దోహదపడుతుందని అన్నారు.
DCP...
మండల కేంద్రంలోని మంచినీటి చెరువు వద్ద గణనాథుడికి టెంకాయ కొట్టి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసు అధికారులు ప్రారంభించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ సంజీవరావు, ఎస్‌ఐ ముత్యం రాజేందర్‌ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి గుగులోత్‌ యాకూబ్‌ నాయక్‌ తదితరులు పాల్గొని నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.