Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొనారెడ్డి చెరువులో ఘనంగా గణేష్‌ నిమజ్జనం

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 05:35 PM | TELANGANA
కొనారెడ్డి చెరువులో ఘనంగా గణేష్‌ నిమజ్జనం

వర్ధన్నపేట: మున్సిపాలిటీ పరిధిలోని కొనారెడ్డి చెరువు వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి పాల్గొన్నారు. నిమజ్జనాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, రహదారి తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో పారిశుధ్య సిబ్బంది నిరంతరం విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, భక్తులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలని చైర్మన్‌ కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌ డీఈ దానయ్య, ఇన్‌చార్జి కమిషనర్‌ కమ్మం కృష్ణ, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.