Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భక్తులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు... చైర్మన్ పాలకుర్తి సారంగపాణి

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 07:09 AM | Array
భక్తులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు... చైర్మన్ పాలకుర్తి సారంగపాణి

వర్ధన్నపేట: మున్సిపాలిటీ పరిధిలోని కోనారెడ్డి చెరువు వద్ద నేడు నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణితో కలిసి వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, విద్యుత్‌ శాఖ డీఈ దానయ్య పరిశీలించారు. భద్రత, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌, విద్యుత్‌, లైటింగ్‌, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ సంజీవరావు, ఎస్‌ఐ సాయిబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.