ఒక్క వర్షానికే జలమయమైన అమరావతి!

నిన్న కురిసిన ముసురు వర్షానికే రాజధాని అమరావతి ప్రాంతం నీటమునిగిందని వైసీపీకి చెందిన రాహుల్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. వరద నీటిని తొలగించేందుకు సిబ్బంది భారీ మోటార్లను వినియోగిస్తున్నారని తెలిపారు. క్లాస్‌-4 ఉద్యోగుల అపార్ట్‌మెంట్ల గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి నీరు చేరిందని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ సమీపం చెరువును తలపిస్తోందని పేర్కొన్నారు. వీఐటీ యూనివర్సిటీ పక్కన, రైతులకు కేటాయించిన ఇళ్ల స్థలాల రహదారులు సైతం నీటమునిగాయని వెల్లడించారు.