ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. !

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13 కార్పొరేషన్లలో 922 డివిజన్లకు గాను 118 ఏకగ్రీవం కాగా, 804 స్థానాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. 87 చైర్‌పర్సన్‌ స్థానాల్లో 17 ఏకగ్రీవమయ్యాయి. 3,020 మున్సిపల్‌ వార్డుల్లో 637 ఏకగ్రీవం కాగా, మిగతా స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పెద్దాపురం మున్సిపాలిటీ 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్‌ 773 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎర్రగుంట్ల 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.