గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు గడువు పొడిగించాలి: కవిత

హైదరాబాద్‌: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఈ నెల 21 వరకు కొనసాగనున్నందున గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా కోరారు.