స్ట్రాంగ్‌రూమ్ తాళం మిస్సింగ్.. తాళం పగులగొట్టి ఓట్ల లెక్కింపు!
AP : పార్వతీపురం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో స్ట్రాంగ్‌రూమ్ తాళాలు కనిపించక అధికారులు హడావుడికి గురయ్యారు. తాళాల కోసం వెతకడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. చివరకు సిబ్బంది స్ట్రాంగ్‌రూమ్ తాళాన్ని పగులగొట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.