నక్సలిజం అంతం దిశగా పరిణామాలు.. ఆలోచింపజేస్తున్న ‘ఎదురుచూపు’ పాట
దేశంలో నక్సలిజం దాదాపు అంతమయ్యే దశకు చేరడం, మావోయిస్టుల స్థావరాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ‘ఎదురుచూపు’ పాట మరింత చర్చనీయాంశంగా మారింది. అతివాద భావజాలం ప్రభావంతో అడవిబాట పట్టిన కొడుకు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే తల్లి వేదనను ఆవిష్కరించిన ఈ పాట, నక్సలిజం ప్రభావం వెనుక ఉన్న కుటుంబాల కన్నీటి గాథలను గుర్తుచేస్తూ అందరినీ ఆలోచింపజేస్తోంది.