కూతురి వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్‌రెడ్డికి షర్మిల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ రిసెప్షన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. డిసెంబర్ 5న అంజలి రెడ్డి, రఘురామ్ రెడ్డి వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ షర్మిల ముఖ్యమంత్రికి ఆహ్వానం అందజేశారు. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న నేతలు కుటుంబ వేడుకలకు ఆహ్వానాలు అందించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.