హత్యకు కుట్ర భగ్నం.. ఐదుగురు నిందితుల అరెస్ట్

HYD : ఉప్పల్‌ శిల్పారామం సమీపంలో హత్యకు కుట్ర పన్నిన ఐదుగురిని ఉప్పల్‌ పోలీసులు, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్‌ బృందాలు సంయుక్తంగా అరెస్ట్‌ చేశాయి. వారి నుంచి రెండు నాటు తుపాకులు, 8 తూటాలు, మూడు కత్తులు, రెండు స్కూటర్లు, ఆటో, నాలుగు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో హత్యాయత్నాన్ని అడ్డుకుని ప్రాణాపాయాన్ని నివారించారు.