రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు
TG : హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ బచావో ర్యాలీ ఓట్ల పరిరక్షణ కోసం కాదని, అక్రమ చొరబాటుదారులను కాపాడేందుకేనని ఆరోపించారు. నకిలీ, డూప్లికేట్ ఓట్ల తొలగింపును రాహుల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు.