రాప్తాడు దాడి నిందితుడి పరిస్థితి విషమం.. రెండు కాళ్లు తొలగించే అవకాశం

AP : అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో అతడి రెండు కాళ్ల మోకాళ్ల కింది భాగాల్లోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కుడికాలులో ఇంకా మూడు బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. వైద్యులు త్వరలో శస్త్రచికిత్స చేయనుండగా, రెండు కాళ్లు తొలగించే పరిస్థితి రావచ్చని సమాచారం.