ఏపీలో 13 వార్డులు, డివిజన్లలో రీపోలింగ్‌.. రేపు ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అవకతవకల ఆరోపణలతో కడప, అనంతపురం, తిరుపతి కార్పొరేషన్లతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 13 వార్డులు, డివిజన్లలో రీపోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లోని 3,453 వార్డులకు జరిగిన పోలింగ్‌లో 60.36 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 96.89 లక్షల మంది ఓటర్లలో 58.48 లక్షల మంది ఓటు వేశారు. రేపు ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.