ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

ఢిల్లీ: మంగోల్‌పురి పారిశ్రామిక ప్రాంతంలోని పాదరక్షల ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న ఆరుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించగా, నలుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.