రైలులో పవర్‌ బ్యాంక్‌ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం*

బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి 10.40 గంటలకు పవర్‌ బ్యాంక్‌ పేలడంతో కలకలం రేగింది. కాట్పాడి స్టేషన్‌ సమీపంలో జనరల్‌ బోగీలో ప్రయాణికుడి పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు చెలరేగాయి. అవి సీట్లకు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మంటలను ఆర్పి పరిశీలించగా, ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించారు.