ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు

AP : అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఆరు గంటల్లో వాయుగుండంగా, అనంతరం తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45–65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.