లేడీస్‌ హాస్టల్‌ ముసుగులో అండాల దందా? బేగంపేటలో 10 మంది యువతులు అదుపులోకి!

TG : హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ అమీ నీతా గర్ల్స్‌ హాస్టల్‌పై అండాలను అక్రమంగా సేకరిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు దాడులు చేశారు. బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ బృందాల తనిఖీల్లో బిహార్‌, యూపీ, ఒడిశాకు చెందిన 10 మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అండాల సేకరణలో నిబంధనలు, యువతుల సమ్మతి, ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వీర్యకణాల సరఫరా కోణంలోనూ ఆరా తీస్తున్నారు.