ఎన్హెచ్-16పై వరద బీభత్సం.. 10 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్
శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నది వరద ఉధృతితో ఇచ్చాపురం సమీపంలో జాతీయ రహదారి-16పైకి నీరు చేరింది. దీంతో హైవేపై రాకపోకలు నిలిచిపోయి దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. నరసన్నపేట, టెక్కలి, పలాస మార్గాల్లో అధికారులు వాహనాలను నిలిపివేశారు. వరద తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.