ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం..

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన బెంగళూరుకు చెందిన ఐదుగురు భక్తులు హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బద్రీనాథ్‌ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌ చమోలి జిల్లా జోషిమఠ్‌ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులతో పాటు పైలట్‌ కూడా మృతి చెందినట్లు UCADA సీఈఓ ప్రతీక్‌ జైన్‌ వెల్లడించారు.