గంజాయి కేసులో రూ.70.39 లక్షల ఆస్తులు జప్తు
WGL : వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిందితులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన రూ.70,39,910 విలువైన ఆస్తులను తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఫ్రీజ్ చేసి జప్తు చేసింది. 147.300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న కేసులో కార్లు, బ్యాంకు ఖాతాలు, ట్రాక్టర్, బైక్, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ సంపాదనతో ఆస్తులు కూడబెట్టడాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్నారు.