తిరుమల శ్రీవారి ఆలయ శాసనాలకు డిజిటల్‌ రక్షణ

AP : తిరుమల శ్రీవారి ఆలయంలోని సుమారు 750 చారిత్రక శాసనాలను భారత్‌ శ్రీ ప్రాజెక్టులో భాగంగా భారత పురావస్తు శాఖ డిజిటలైజేషన్‌ చేస్తోంది. ఇందులో పదో శతాబ్దానికి చెందిన వైదుంబుల శాసనాలు, విజయనగర సామ్రాజ్య కాలం నాటి తమిళ శాసనాలు ఉన్నాయి. ఆలయ చరిత్ర, అప్పటి పాలకుల సేవలు, సామాజిక పరిస్థితులను తెలిపే ఈ విలువైన ఆధారాలను భవిష్యత్తు తరాలకు భద్రపరచడమే లక్ష్యం.